శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 11, 2020 , 13:55:52

కిర‌ణ్‌కుమార్ కు చిరు పోటీ..నెటిజ‌న్ల ఫ‌న్నీ కామెంట్స్

కిర‌ణ్‌కుమార్ కు చిరు పోటీ..నెటిజ‌న్ల ఫ‌న్నీ కామెంట్స్

నాలుగు ద‌శాబ్దాలుగా త‌న న‌ట‌న‌తో కోట్లాదిమంది అభిమాన‌గ‌ణాన్ని సంపాదించుకుని..మెగాస్టార్ గా అంద‌రివాడ‌య్యాడు చిరంజీవి. ప్ర‌స్తుతం ఈ యాక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆచార్య చిత్రంలో న‌టిస్తున్నాడు. చిరు నున్న‌టి గుండుతో ఉన్న లుక్ ఒక‌టి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. అప్పా నేనేం చూశాను.మీరు గొప్ప తండ్రిగా క‌నిపిస్తున్నారు.. రాంచ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చారు.

అయితే చిరు గ‌తంలో ఎన్న‌డూ క‌నిపించ‌ని విధంగా స‌రికొత్త లుక్‌లో అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. చిరు స‌రికొత్త అవ‌తారంపై నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్టు పెడుతున్నారు. ల‌లితా జ్యువెల‌ర్స్ ఎండీ కిర‌ణ్ కుమార్ చిరంజీవి గట్టి పోటీనే ఇస్తున్నార‌ని అంటున్నారు. డ‌బ్బులు ఊరికే రావంటూ కిర‌ణ్ కుమార్ చెప్పిన డైలాగ్స్ తోపాటు ఆయ‌న లుక్ కూడా ఎంతో పాపుల‌ర్ అయింది. ఆయ‌న్ను ముద్దుగా గుండు బాస్ అని పిలుచుకున్నారు జ‌నాలు. ఇదిలా ఉంటే గ‌తంలో త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ శివాజీ సినిమాలో గుండు బాస్ గా అల‌రించిన విష‌యం తెలిసిందే. డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు కూడా శివ‌శంక‌ర్ సినిమాలో నున్న‌టి గుండుతో క‌నిపించి అల‌రించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo