మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 12:26:44

చిరంజీవి 2 నెల‌లు బాధ‌ప‌డ్డారు: పోసాని కృష్ణ‌ముర‌ళి

చిరంజీవి 2 నెల‌లు బాధ‌ప‌డ్డారు: పోసాని కృష్ణ‌ముర‌ళి

సినీ ఇండ‌స్ట్రీలో చిరంజీవికి చాలా మందితో మంచి అనుబంధం ఉంద‌నే విషయం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. చిరంజీవితో ఆప్యాయంగా మెలిగే వ్య‌క్తుల్లో ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళి ఒక‌రు. చిరంజీవి ఒక‌సారి జరిగిన సంఘ‌ట‌న‌తో రెండు నెల‌లు బాధ‌పడ్డార‌ట‌. ఈ విష‌యం గురించి ఓ ఇంట‌ర్వ్యూలో పోసాని మాట్లాడుతూ...పీఆర్పీ నుంచి టికెట్ ఇచ్చేట‌పుడు చిరంజీవి న‌న్ను ఎలాంటి డ‌బ్బు అడ‌గ‌లేదు. నిజాయితీగా న‌న్ను న‌మ్మి టికెట్ ఇచ్చారు. కానీ నేను గెల‌వ‌లేక‌పోయాను. 

అయితే ఆ స‌మ‌యంలో టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు చిరంజీవిని ఎగ‌తాళి చేశారు. చిరంజీవి కూతురిలో ఒక‌రు ఓ వ్య‌క్తిని పెండ్లి చేసుకున్న విషయంపై టీడీపీ మ‌హిళానేత‌లు చిరంజీవిపై కామెంట్స్ చేశారు. త‌న సొంత కూతురినే కంట్రోల్ చేయ‌ని వారు, రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తార‌ని ఎద్దేవా చేశారు. టీడీపీ కామెంట్ల‌తో చిరంజీవి చాలా అప్ సెట్ అయ్యారు. రెండు నెల‌లు చాలా బాధ‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత చిరంజీవి ఈ విషయంపై మాట్లాడుతూ..చంద్ర‌బాబు ఓ గౌర‌వ‌ప్ర‌ద‌మైన వ్య‌క్తి. ఆయ‌న క‌నీసం త‌న పార్టీ నేత‌లు నా కుటుంబంపై బుర‌ద జ‌ల్లేందుకు ప్ర‌య‌త్నిస్తే ఆపలేదు. ఇలాంటి ప‌రిణామాలు చూసిన త‌ర్వాత నాకు చాలా కోపంగా, బాధ‌గా అనిపించింది. అప్ప‌టినుంచి నాకు చంద్ర‌బాబు అంటే చాలా విర‌క్తి క‌లిగింది. ఎందుకంటే బాబు పార్టీ మ‌హిళా నేత‌ల‌తో క‌నీసం క్ష‌మాప‌ణ కూడా చెప్పించ‌లేదని చిరంజీవి చెప్పుకొచ్చార‌ని పోసాని వెల్ల‌డించారు. . 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo