ఒక్క హిట్ వస్తే ఆ హీరోలో ఇంత జోష్ ఉంటుందా అనేలా రెచ్చిపోతున్నాడు రవితేజ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈయన నటించిన క్రాక్ సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. ఇదే జోరులో మే 28న ఖిలాడీ సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు రవితేజ. హలో గురు ప్రేమకోసమే తర్వాత మరో సినిమా చేయని ఈ దర్శకుడు.. రవితేజ కోసమే ప్రత్యేకంగా ఒక కథ సిద్ధం చేశాడు.
తన ఆస్థాన రచయిత ప్రసన్న కుమార్ తో కలిసి పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ గా రవితేజ సినిమా తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ లో మొదలు కానుంది. ఇందులో లాయర్ గా కనిపించబోతున్నాడు రవితేజ. అంతేకాదు డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇలా ఉండగానే రామ్ చరణ్ నిర్మాతగా మలయాళ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ లో విజయ్ సేతుపతితో కలిసి రవితేజ నటించబోతున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా మరో సినిమాకు కూడా రవితేజ కమిట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అది కూడా మూడు నేషనల్ అవార్డులు వచ్చిన సినిమాను తెరకెక్కించిన దర్శకుడితో మాస్ రాజా త్వరలోనే సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయనెవరో కాదు వంశీ పైడిపల్లి. మహర్షి సినిమాకు మూడు నేషనల్ అవార్డులు రావడంతో ఒక్కసారిగా ఈయన పేరు హాట్ టాపిక్ అయిపోయింది.
మహర్షి తర్వాత మరోసారి మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. కానీ చివరి నిమిషంలో వంశీని కాదని మరో సినిమా చేశాడు మహేష్. దాంతో ఇప్పటి వరకు ఖాళీగానే ఉన్నాడు ఈ దర్శకుడు ఈ మధ్య ఒక వేడుకలో కలిసినప్పుడు రవితేజకు ఒక లైను చెప్పి ఒప్పించాడు వంశీ పైడిపల్లి. ఫుల్ నెరేషన్ ఇస్తే ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సీక్రెట్ ప్లేస్‌లో సారా..ట్రెండింగ్‌లో స్టిల్స్
రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం
మహేశ్‌బాబు తండ్రిగా మలయాళ నటుడు..?
జనాల్లేక థియేటర్స్ మూసుకుంటున్న యాజమాన్యం
వర్షంలో చైతూ, సాయిపల్లవి డ్యాన్స్
నిన్ను మించిన వాళ్లు లేరు.. కంగనపై సమంత ప్రశంసల వర్షం
థాయ్‌లాండ్ ఫారెస్ట్‌లో 15 రోజులున్నా: రానా
ఐశ్వర్యరాజేశ్ ఫైనల్..మరో హీరోయిన్ కోసం వేట..!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..!
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
ముద్దు వీడియో షేర్ చేసిన జెనీలియా.. స్పందించిన ప్రీతి
ఈ ఇద్దరు కొత్త హీరోయిన్ల సుడి పీక్స్.. స్టార్ హీరోలతో ఆఫర్స్
తరుణ్ రీఎంట్రీ.. లవ్ స్టోరీతో వస్తున్నాడంట