బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 13:45:59

ప్ర‌భాస్ మూవీకి ప‌ని చేయ‌నున్న లెజెండ‌రీ డైరెక్ట‌ర్

ప్ర‌భాస్ మూవీకి ప‌ని చేయ‌నున్న లెజెండ‌రీ డైరెక్ట‌ర్

నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో రానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆస‌క్తిక‌ర అప్ డేట్ ను చిత్ర‌యూనిట్ అందించింది.. లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస రావు ఈ చిత్రానికి గైడ్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌ట‌. సినిమాకు కావాల్సిన కొన్ని కీల‌క ఇన్ పుట్స్ ను దర్శ‌కుడు నాగ్ అశ్విన్ కు సింగీతం శ్రీనివాస్ ద‌గ్గ‌రుండి అందివ్వ‌నున్నారు. సింగీతం పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వైజ‌యంతీ మూవీస్ సంస్థ ఈ న్యూస్ ను ప్ర‌క‌టించింది.

"సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కల ఎట్ట‌కేల‌కు నిజ‌మ‌వుతోంది. మా ఎపిక్‌కు సింగీతం శ్రీ‌నివాస‌రావు గారిని ఆహ్వానిస్తున్నందుకు థ్రిల్ ఫీల‌వుతున్నాం. ఆయ‌న క్రియేటివ్ సూప‌ర్‌ప‌వ‌ర్స్ క‌చ్చితంగా మాకు మార్గ‌ద‌ర్శ‌క శ‌క్తిగా ఉంటుంది." అని సోష‌ల్ మీడియా ద్వారా వైజ‌యంతీ మూవీస్ సంస్థ ప్ర‌క‌టించింది.

ఆదిత్య 369 వంటి బ్లాక్ బాస్ట‌ర్ ఆల్ టైమ్ ఫేవ‌రెట్ హిట్ నందించిన సింగీతం ఎంట్రీతో సైన్స్ ఫిక్ష‌న్ చిత్రం మ‌రో సాలిడ్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌‌ప‌డుతున్నారు. ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ ప్రాజెక్టును ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తార‌నే విషయంపై త్వ‌ర‌లో వెల్ల‌డించనుంది ప్ర‌భాస్ అండ్ టీం. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే హీరోయిన్ గా న‌టిస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo