మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 19, 2020 , 18:19:33

టాలీవుడ్‌పై కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్‌పై కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్ : టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీపై బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం, బాలీవుడ్ పరిశ్రమలోని ఒక వర్గంతో పోరాడుతున్న కంగనా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉందని ట్వీట్‌ చేసింది. ‘భారతదేశంలో బాలీవుడ్ అతిపెద్ద చిత్ర పరిశ్రమ అని ప్రజలకు తప్పుడు అవగాహన ఉంది. కానీ.. తెలుగు చిత్ర పరిశ్రమ శాసిస్తోంది. బాలీవుడ్ చిత్రాలు చాలా వరకు షూటింగ్‌లు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తున్నాయని’ ఆమె పేర్కొన్నారు. కంగనా రనౌత్ మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరంగా పాన్ ఇండియన్ ప్రాజెక్టులను రూపొందిస్తోంది. ‘భారతదేశంలో అగ్రశ్రేణి చిత్ర పరిశ్రమ.. హిందీ చిత్ర పరిశ్రమ అని ప్రజల అభిప్రాయం తప్పు.

తెలుగు చిత్ర పరిశ్రమ తనను తాను అగ్రస్థానంలో నిలుపుకుంది. బహు భాష సినిమాలు చేయడంతో పాటు పాన్ ఇండియా సినిమాలు చేయడంలో తెలుగు సినిమా ముందుంది’ అని ఆమె ట్వీట్‌ చేశారు. ముంబై ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడాలోని అతిపెద్ద ఫిలిం సిటీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారన్న వార్తలపై కంగనా ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే నెపోటిజం, డ్రగ్‌మాఫియా, సెక్సిజం, విదేశీ సినిమా, తదితర ఎనిమిదింటిని ఉగ్రవాదంతో పోలుస్తూ.. వాటి నుంచి పరిశ్రమను కాపాడాలని ట్వీట్‌ చేసింది. కంగనా తెలుగులో ప్రభాస్‌కు జోడిగా ఏక్‌ నిరంజన్‌ చిత్రంలో నటించింది.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo