బుధవారం 08 జూలై 2020
Cinema - Jun 06, 2020 , 10:12:49

జూన్ 9న జ‌గ‌న్‌ని క‌ల‌వ‌నున్న ఇండ‌స్ట్రీ పెద్ద‌లు..!

జూన్ 9న జ‌గ‌న్‌ని క‌ల‌వ‌నున్న ఇండ‌స్ట్రీ పెద్ద‌లు..!

లాక్‌డౌన్ వ‌ల‌న సినీ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ని ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళిన ఇండ‌స్ట్రీ పెద్ద‌లు జూన్ 9 మ‌ధ్యాహ్నం ఎపీ సీఎం జ‌గ‌న్‌ని క‌ల‌వ‌నున్నారు. ఈ విష‌యాన్ని కొద్ది సేప‌టి క్రితం సి.క‌ళ్యాణ్ క‌న్‌ఫాం చేశారు. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ త‌ర‌పున జ‌గ‌న్‌ని క‌లుస్తున్నాం. ఇండ‌స్ట్రీ ప‌డుతున్న ఇబ్బందుల‌ని ఆయ‌న‌కి వివ‌రించ‌నున్నాం అని క‌ళ్యాణ్ అన్నారు.

లాక్‌డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌ల‌ని పాటిస్తూ షూటింగ్ నిర్వ‌హిస్తామ‌నే విష‌యాన్ని కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు. చిరంజీవి ఆధ్వ‌ర్యంలో, త‌ల‌సాని నేతృత్వంలో కేసీఆర్‌తో జ‌రిగిన ఈ మీటింగ్‌లో ప‌లు విష‌యాలు చ‌ర్చించారు. ఇప్పుడు జ‌గ‌న్‌తోను కీల‌క విష‌యాల‌పై చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ మీటింగ్‌కి బాల‌య్య‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌ని కూడా ఆహ్వానించ‌నున్న‌ట్టు స‌మాచారం.  

లాక్‌డౌన్ వ‌ల‌న 70 రోజులుగా షూటింగ్స్ బంద్ అయిన సంగ‌తి తెలిసిందే. దీని వ‌ల‌న టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. రోజువారి వేత‌నం పొందే కార్మికులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరిని ఆదుకునేందుకు  చిరంజీవి నేతృత్వంలో క‌రోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటైంది. ఈ ఛారిటీ ద్వారా సినీ కార్మికుల ఆక‌లిని కొంత వ‌ర‌కు తీర్చారు. 


logo