శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 20:15:26

టీవీ యాంక‌ర్ గా మారిన హీరోయిన్‌

టీవీ యాంక‌ర్ గా మారిన హీరోయిన్‌

గ‌తేగాది బిగ్ బాస్ 3 షోలో పాల్గొని పాపులారిటీ తెచ్చుకుంది హీరోయిన్ వితికాశేరు. ఈ షో ద్వారా వ‌రుణ్ తేజ్‌-వితికా శేరు దంపతులు ప్రేక్ష‌కులకు వినోదాన్ని అందించే ప్ర‌య‌త్నం చేశారు. తాజాగా వితికాశేరు ఇపుడు మ‌రోసారి టీవీ స్ర్కీన్ పై మెరిసేందుకు సిద్ద‌మైంది. ఓ ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్ లో ప్ర‌సారం కానున్న కార్య‌క్ర‌మానికి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌నుంది వితికా. అక్టోబ‌ర్ 4 నుంచి ప్ర‌సారం కానున్న సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న షోకు యాంక‌ర్ గా ప‌నిచేయ‌నుంది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది.

యాంక‌ర్ గా ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా ఎక్స‌యిటింగ్ గా ఉంది. మీరంతా న‌న్ను ఎప్పుడు టీవీ లో చూస్తార‌ని ఎదురుచూస్తున్నా..ఓ స్టిల్ ను పోస్ట్ చేస్తూ క్యాప్ష‌న్ ఇచ్చింది. వితికాశేరు-వ‌రుణ్ సందేశ్ ఐదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం వివాహ‌బంధంతో ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.