శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 14:44:58

ఆక‌ట్టుకుంటోన్న‌ పూర్ణ 'సుంద‌రి' ప్రీ లుక్

ఆక‌ట్టుకుంటోన్న‌ పూర్ణ 'సుంద‌రి' ప్రీ లుక్

టాలీవుడ్ అందాల భామ పూర్ణ న‌టిస్తోన్న కొత్త చిత్రం  'సుంద‌రి' . క‌ళ్యాణ్ జీ గోగ‌న డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ మూవీ ప్రీ లుక్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. అంద‌మైన కాళ్ల‌కు బంగారు ప‌ట్టీల‌తో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న ప్రీలుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా వ‌స్తోన్న ఈ చిత్రంలో పూర్ణ లీడ్ రోల్ లో న‌టిస్తోంది. ప్రీ లుక్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు డైరెక్ట‌ర్.  రిజ్వాన్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సుంద‌రి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

పూర్ణ కొత్త చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఏఎల్ విజ‌య్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న త‌లైవి చిత్రంలో వీకే శ‌శిక‌ళ పాత్ర‌లో న‌టిస్తోంది పూర్ణ‌. దీంతోపాటు క‌న్న‌డ, మ‌ల‌యాళంలో రెండు చిత్రాలు చేస్తోంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.