మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 15:06:40

మ్యూజిక్ వీడియో చేసిన మెహ‌రీన్

మ్యూజిక్ వీడియో చేసిన మెహ‌రీన్

ముంబై: కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించింది పంజాబీ ముద్దుగుమ్మ మెహ‌రీన్ ఫిర్జాదా. ఆ త‌ర్వాత ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా మారిపోయింది. నాగ‌శౌర్య హీరోగా వ‌చ్చిన అశ్వ‌త్థామ చిత్రంలో చివ‌ర‌గా క‌నిపించింది మెహ‌రీన్‌. అయితే ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావంతో కొత్త సినిమాలేవి సెట్స్ పైకి వెళ్ల‌డం లేదు. అయితే తాజాగా ఓ మ్యూజిక్ వీడియోతో అభిమానుల‌ను అల‌రించేందుకు రెడీ అవుతోంది మెహ‌రీన్. బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా అంటూ ప్ర‌పంచ‌దేశాల్లోని మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను అల‌రించాడు బాలీవుడ్ సింగ‌ర్ ఆర్మాన్ మాలిక్‌.

ఈ సింగ‌ర్ జ‌ర థెహ్రో పేరుతో మ్యూజిక్ వీడియోను రూపొందించారు. ముంబైలోని మెహ‌రీన్ అపార్టుమెంట్ ప‌రిస‌రాల్లో.. ఆర్మాన్ మాలిక్‌, మెహ‌రీన్ పై ఈ వీడియోను చిత్రీక‌రించారు. ట్రిగ్గ‌ర్ హ్యాపీ-డ‌బూ మాలిక్ మ్యూజిక్ వీడియోకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పాపుల‌ర్ యూట్యూబ్ ఛాన‌ల్ లో త్వ‌ర‌లోనే మ్యూజిక్ వీడియో సంద‌డి చేయ‌నుంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo