Krithi Shetty : ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతిశెట్టి. నిజానికి ఉప్పెన సినిమా రిలీజ్‌కు ముందు పోస్టర్స్ చూసే కృతికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక సినిమా విడుదలైన తర్వాత ఆ క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్న కృతి శెట్టికి ఒక కోరిక ఉందంట. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన కృతి శెట్టి తన మనసులోని మాటను బయటపెట్టింది.
తెలుగు ఇండస్ట్రీ తనకు చాలా బాగా నచ్చిందని.. ఒక్క సినిమాతోనే ఇక్కడి ప్రేక్షకులు తనపై చూపించిన అభిమానానికి పొంగిపోతున్నానని తెలిపింది కృతి శెట్టి. ఈ సందర్భంగానే తనకు ఒక కోరిక ఉందని చెప్పుకొచ్చింది. సినిమాలో తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశపడుతుందంట. ఈ కోరిక నెరవేర్చే దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్లు సొంత డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆలోచిస్తున్నారు. కాకపోతే కీర్తి సురేష్, సాయిపల్లవి లాంటి కథానాయికలు తెలుగు సరిగ్గా రాకపోయినా నేర్చుకుని మరి డబ్బింగ్ చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ల బాటలోనే కృతి శెట్టి కూడా సొంత డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశపడుతోంది. ఫ్యూచర్ లో తప్పకుండా చేసి చూపిస్తాను అంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మరో రీమేక్ పై కన్నేసిన వెంకటేశ్..?
కలలు రియాలిటీ కన్నా బాగున్నపుడు..రాశీఖన్నా స్టిల్ వైరల్
సౌందర్య శర్మ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్
కరోనాతో కన్నుమూసిన ప్రముఖ హీరోయిన్ సోదరుడు..!
పవన్ కళ్యాణ్ హెల్త్‌పై తాజా అప్డేట్..!