మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 10, 2020 , 21:28:12

ఆ హీరోయిన్‌కి ఇన్నోవా కావాల్సిందే !

ఆ హీరోయిన్‌కి ఇన్నోవా కావాల్సిందే !

ఇది ఇప్పటి ముచ్చట కాదు...కానీ టాలీవుడ్‌లో ఓ హీరోయిన్‌ డిమాండ్స్‌ ఎలా వుంటాయో.. నిర్మాతలను ఎంతటి ఒత్తిడికి గురిచేస్తారో తెలియడం గురించి జరిగిన ఓ సంఘటన చెప్పుకుందాం...ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా లవర్‌బాయ్‌ ఇమేజ్‌తో పాటు యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాందించుకున్న హీరో నటిస్తున్న సినిమా అది. ఇప్పుడు ఆ హీరో మన మధ్యలో లేడు అని చెప్పడానికి బాధగా వుంది. సినిమా రంగంలో బంగారులోకాన్ని ఊహించుకుని తొలిసినిమాతో మంచి గుర్తింపు సంపాందించుకున్న ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్‌ మూటగట్టుకుని..ఇటీవల పలు వార్తలతో హాట్‌టాపిక్‌ మారిన నాయిక నటించిన సినిమా అది. ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేసి నిర్మాతగా మారిన చిన్న నిర్మాత అతను.. ఆ సినిమాకు సంబంధించిన ప్రెస్‌మీట్‌ ఓ హోటల్‌లో జరుగుతుంది. 

మీడియా, హీరో, ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు సిద్ధం.. హీరోయిన్‌ మాత్ర ఇంకా రాలేదు.. అందరూ వెయిటింగ్‌.. ఇంతలోనే నిర్మాతకు హీరోయిన్‌ అసిస్టెంట్‌ నుండి ఫోన్‌.. హీరోయిన్‌కు పికప్‌ చేసుకోవడానికి మీరు క్వాలీస్‌ కారు పంపారు కానీ హీరోయిన్‌ గారు ఇన్నోవా కావాలంటున్నారు’ అని చెప్పడంతో.. ఇప్పటికే ఆలస్యమైంది. మీడియాతో పాటు అందరూ వెయిట్‌ చేస్తున్నారు. ఈ సారికి రమ్మనండి..ఇంకోసారి తప్పకుండా ఇన్నోవా పంపుతానంటూ నిర్మాత రిక్వెస్ట్‌ చేశాడు. అయినా హీరోయిన్‌ ససేమీరా అనడంతో.. గత్యంతరం లేక ఇన్నోవాను పంపండంతో హీరోయిన్‌ ప్రెస్‌మీట్‌కు హాజరైంది. కేవలం ఇన్నోవా గురించి దాదాపుగా గంటన్నర ఆలస్యంగా ప్రెస్‌మీట్‌ ప్రారంభమైంది. 

ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్స్‌ డిమాండ్‌  ఎలా వుంటాయో చెప్పడానికి ఇదొక సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే నాయికలు అంతా ఇలాగే వుంటారనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే తమ సొంతఖర్చుతో, సొంత కారులో షూటింగ్‌లు హాజరవుతూ.. నిర్మాతలకు సహాకరించే హీరోయిన్లు కూడా మనకు వున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo