బయట పెరుగుతున్న కరోనా కేసులు చూస్తుంటే అంతా భయపడిపోతున్నారు. వామ్మో అంటూ తలపట్టుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కరోనా తీరని శోకం మిగులుస్తుంది. ముఖ్యంగా సెకండ్ వేవ్‌లో అయితే ఎంతోమంది తెలిసిన వాళ్లే కన్ను మూస్తున్నారు. ఇదిలా ఉంటే కోవిడ్ కారణంగా టాలీవుడ్లో షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఇప్పట్లో మొదలు పెట్టడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. మొన్నటి వరకు కరోనా కేసులు ఉన్నా కూడా షూటింగ్స్‌కు అనుమతులు ఉండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని తమ సినిమాలను పూర్తి చేశారు దర్శక నిర్మాతలు. హీరోలు కూడా బాగానే కో ఆపరేట్ చేశారు.
అయితే లాక్ డౌన్ విధించడంతోనే పరిస్థితి అందరికీ అర్థమైపోతుంది. ఇలాంటి సమయంలో షూటింగ్స్ మాట ఎత్తడం కూడా తప్పు అవుతుందేమో..? పైగా మన హీరోలు కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే రామ్ చరణ్, కళ్యాణ్ దేవ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మహమ్మారితో పోరాడుతున్నాడు. ఈ క్రమంలో షూటింగ్స్ కు ఇప్పట్లో వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. లాక్ డౌన్ తర్వాత కూడా నెల రోజులకు పైగానే షూటింగ్స్ వైపు ఎవరూ అడుగులు వేయకూడదని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. నెల రోజుల తర్వాత కానీ పూర్తిగా కోలుకున్నట్లు అర్థం కావడం లేదు. అందుకే మన హీరోలు కూడా షూటింగ్స్ కు ఇప్పట్లో వెళ్లకూడదని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు అయితే మరో రెండు మూడు నెలల వరకు షూటింగ్ వైపు వెళ్లేలా కనిపించడం లేదు. పవన్ కూడా రెండు నెలల వరకు షూటింగ్ కు రాడని తెలుస్తుంది. ఇలా టాలీవుడ్ లో చాలా మంది హీరోలు షూటింగ్స్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
లాక్ డౌన్ ఎఫెక్ట్ : మళ్లీ ఆగిన సీరియల్ షూటింగ్స్
జాతిరత్నం హీరోయిన్ గ్లామర్ పిక్స్.. వైరల్
రాధేతో నిరాశపరచిన ప్రభుదేవా..డైరెక్షన్‌కు బైబై చెప్పాలంటూ సూచన!
కుర్ర దర్శకుల కలలను చిదిమేస్తున్న కరోనా
విష్ణు ప్రియ గ్లామర్ షో.. యువత ఫిదా
పాత ఫార్ములాని ఫాలో అవుతున్న త్రివిక్రమ్..!
రాధే చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో రచ్చ
అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ లుక్.. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్..!
నాగార్జునతో పదోసారి జోడీ కడుతున్న అనుష్క
సల్మాన్ ఖాన్ రాధే సినిమాకు పైరసీ దెబ్బ
‘పుష్ప’ రెండు భాగాలు చేయడం వెనక పెద్ద కథే ఉంది..!
తమిళియన్‌ను పెండ్లి చేసుకుంటా: రష్మిక