ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 21:25:53

14 ఏండ్ల త‌ర్వాత అమ్మ సెంటిమెంట్‌తో..!

14 ఏండ్ల త‌ర్వాత అమ్మ సెంటిమెంట్‌తో..!

టాలీవుడ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తోన్న 30వ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర్వానంద్ లొకేష‌న్ ఫొటో షేర్ చేస్తూ షూట్ కంప్లీట్ అయిన విష‌యాన్ని ట్విట‌ర్ లో పోస్ట్ చేశాడు.  తెలుగు, తమిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తోన్న ఈ చిత్రంతో మ‌రోసారి మ‌ద‌ర్ సెంటిమెంట్‌ను సిల్వ‌ర్ స్క్రీన్ పై రిపీట్ చేయనున్నాడట శ‌ర్వా. డైరెక్ట‌ర్ శ్రీకార్తీక్ ఈ మూవీలో త‌ల్లీకొడుకుల రిలేష‌న్ షిప్ ను అందంగా చూపించ‌నున్న‌ట్టు టాక్‌. శ‌ర్వానంద్ త‌ల్లిగా అక్కినేని అమ‌ల న‌టిస్తోంది.

2006లో వ‌చ్చిన అమ్మ‌చెప్పింది చిత్రంలో త‌ల్లీకొడుకుల సెంటిమెంట్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది .  14 ఏండ్ల త‌ర్వాత తాజా చిత్రంతో శ‌ర్వానంద్ మ‌రోసారి  అమ్మ ప్రేమ‌ను తెర‌పై చూపించ‌నున్నాడు. ఈ చిత్రంలో రీతూశ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.