బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 07, 2020 , 13:59:10

ర‌వితేజ స్టైలిష్ ఎంట్రీ అదుర్స్

ర‌వితేజ స్టైలిష్ ఎంట్రీ అదుర్స్

టాలీవుడ్ నటుడు ర‌వితేజ ప్ర‌స్తుతం క్రాక్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గోపీచంద్ మ‌లినేని ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కరోనా ఎఫెక్ట్ తో నిలిచిపోయిన సినిమా షూటింగ్ మ‌ళ్లీ . నేడు షురూ అయింది. ప్ర‌స్తుతం రామోజీఫిలింసిటీలో చిత్రీక‌ర‌ణ కొన‌సాగుతుంది. ర‌వితేజ్ సెట్స్ లో గ‌న్ ప‌ట్టుకుని క్లాసీ లుక్ లో గ‌న్ ప‌ట్టుకుని స్లైలిష్ గా న‌డుచుకుంటూ వ‌స్తున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. శృతిహాస‌న్, ఇత‌ర న‌టీన‌టులపై వ‌చ్చే కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు సైలెంట్ గా ఉన్న మేక‌ర్స్ ఇక అప్ డేట్స్ ఇవ్వడం షురూ చేశారు. సినిమా ట్రైల‌ర్, సాంగ్స్ విడుద‌ల‌పై కూడా త్వ‌ర‌లో అప్ డేట్ ఇవ్వ‌నున్నారు. వాస్త‌వ సంఘ‌ట‌నల ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని బి మ‌ధు నిర్మిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo