టాలీవుడ్లో ప్రస్తుతం రీమేక్‌ల హవా కనిపిస్తుంది. వరసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. మన హీరోలు కూడా కథలు దొరకడం లేదన్నట్లు రీమేక్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా మెగా హీరోలు అయితే అన్నీ రీమేక్ సినిమాలు చేస్తున్నారు. అందరూ కాదు కానీ చిరంజీవి, పవన్ ఫోకస్ అంతా ఇప్పుడు రీమేక్ సినిమాలపైనే ఉంది. చిరు ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత వేదాళం, లూసీఫర్ రీమేక్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ కూడా వరసగా రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమా విడుదలైంది. మరోవైపు మలయాళంలో విడుదలైన అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కూడా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ రాస్తున్నాడు.
ఇదిలా ఉంటే దాంతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్ లో పెట్టాడు పవన్ కల్యాణ్. తాజాగా మరో రీమేక్ కూడా పవన్ ఖాతాలో పడిపోయిందని ప్రచారం జరుగుతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. దివంగత దర్శకుడు, అయ్యప్పనుమ్ కోషియుమ్ ఫేమ్ సాచి కథ అందించిన ఈ చిత్రం అక్కడ భారీ విజయం సాధించింది. సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గానే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను తెలుగులో వెంకటేష్, రానా హీరోలుగా రీమేక్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఈ సినిమా రీమేక్ హక్కులను రామ్ చరణ్ తీసుకున్నాడు.
ఈ సినిమాను తెలుగులో పవన్ తో రీమేక్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడు చరణ్.
అయితే పవన్ అనాసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. వరసగా మలయాళ సినిమాలు అవుతున్నాయని మనసు మార్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో ఈ సినిమాను రవితేజతో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను రవితేజ లేదంటే పవన్ చేస్తారని తెలుస్తుంది. మరో పాత్ర కోసం కుర్ర హీరోను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అన్నీ కుదిరి ఈ కాంబినేషన్ కానీ వర్కవుట్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ తెలుగులో సంచలనం సృష్టించడం ఖాయం.
ఇవి కూడా చదవండి..
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్