మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 01, 2020 , 17:16:15

నితిన్ చేతికి సంకెళ్లు..‘‌చెక్’ ఫ‌స్ట్ లుక్

నితిన్ చేతికి సంకెళ్లు..‘‌చెక్’ ఫ‌స్ట్ లుక్

ఐతే, అనుకోకుండా ఒక రోజు, ప్ర‌యాణం, మ‌న‌మంతా..వంటి చిత్రాల‌తో డైరెక్ట‌ర్ల‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. స‌రికొత్త క‌థాంశాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించే ఈ ద‌ర్శ‌కుడు ఇపుడు యువ హీరో నితిన్ తో థ్రిల్ల‌ర్ క‌థాంశాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. నితిన్ కొత్త సినిమా టైటిల్ చెక్. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ను ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ విడుద‌ల చేశారు. నితిన్ చేతికి సంకెళ్ల‌తో ఉండ‌గా..అత‌డి ముందు చెస్ కాయిన్స్ క‌నిపిస్తున్నాయి. పోస్ట‌ర్ చూస్తుంటే డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ యేలేటి థ్రిల్ల‌ర్ స్టోరీతో సినిమాను డిజైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ మూవీలో ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  

భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న ఈ చిత్రం కొంత‌భాగం మిన‌హా షూటింగ్ పూర్తి చేసుకున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం నితిన్ న‌టిస్తోన్న ‌రంగ్ దే షూట్ పూర్త‌యిన వెంట‌నే..చెక్ చిత్రాన్ని కూడా కంప్లీట్ చేయ‌నున్నాడట. ఈ రెండు ప్రాజెక్టులు పూర్త‌య్యాకే అంధాధున్ తెలుగు రీమేక్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo