గురువారం 13 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 21:21:22

బన్నీ లైనప్‌ అదిరింది.!

బన్నీ లైనప్‌ అదిరింది.!

హైదరాబాద్‌ : ‘అల వైకుంఠపురం’ విజయంతో బన్నీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇండస్ట్రీ రికార్డుతో హీరోగా అల్లు అర్జున్‌ను ఒకేసారి పదిమెట్లు ఎక్కించింది ఈ సినిమా. దీంతో బన్నీ ఇక వరుస సినిమాలతో బిజీ కావాలని నిర్ణయించుకున్నాడు. తనను ‘ఆర్య’ సినిమాతో కమర్షియల్‌ హీరోగా మార్చిన దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వంలో ప్రస్తుతం ‘పుష్ఫ’ చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్‌ వాయిదా పడింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించింది. కాగా ప్రస్తుతం దొరికిన ఈ గ్యాప్‌లో బన్నీ తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు. వరుస ప్రాజెక్టులను సెట్‌ చేసుకుంటున్నాడు. చిరంజీవితో ‘ఆచార్య’ను తెరకెక్కిస్తున్న కొరటాల శివ దర్శకత్వలో అల్లు అర్జున్‌ ఓ సినిమా చేయబోతున్నాడు. ‘పుష్ప’ తరువాత ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళుతుంది. వీటితో పాటు ‘యాత్ర’ దర్శకుడు మహి వి.రాఘవ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు అల్లు అర్జున్‌. ఏది ఏమైనా బన్నీ ఫ్యూచర్‌ లైనప్‌ స్ట్రాంగ్‌గా రెడీ చేసుకున్నాడు.


తాజావార్తలు


logo