గురువారం 28 మే 2020
Cinema - May 05, 2020 , 12:38:27

విజయ్‌ దేవరకొండపై తప్పుడు రాతలు.. ఖండించిన టాలీవుడ్‌

విజయ్‌ దేవరకొండపై తప్పుడు రాతలు.. ఖండించిన టాలీవుడ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో  తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు కొద్ది రోజులుగా తీవ్ర‌ ఇబ్బందులు పడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో  మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ 'ది దేవరకొండ ఫౌండేషన్' స్థాపించి 'మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో సహాయక కార్యక్రమాలు చేప‌ట్టారు. దీనిపై  కొన్ని వెబ్‌సైట్లు తప్పుడు కథనాలు ప్ర‌చురించ‌డంతో ఇన్నాళ్లు ఓపిక ప‌ట్టిన విజ‌య్ ఒక్క‌సారిగా ఉప్పెనలా లేచారు. త‌న ఆవేశాన్నంతా వీడియో రూపంలో వ్యక్త‌ప‌రిచారు. ఇప్పుడు ఆయ‌న ఆవేశానికి, ఆవేద‌న‌కి తోడుగా టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ మొత్తం క‌దిలి వ‌స్తుంది.  

మెగాస్టార్ చిరంజీవి, మ‌హేష్ బాబు, ర‌వితేజ‌, అల్ల‌రి న‌రేష్‌, అనీల్ రావిపూడి ఇలా త‌దిత‌ర ప్ర‌ముఖులు విజ‌య్‌కి మ‌ద్ద‌తు తెలిపారు. తాజాగా పూరీ జ‌గ‌న్నాథ్‌, నాగబాబు కూడా త‌మ ట్వీట్స్ ద్వారా అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు. నాగబాబు త‌న ట్వీట్‌లో ..హాయ్‌ విజయ్.. కిల్ ఫేక్ న్యూస్, కిల్ గాసిప్ వెబ్‌సైట్స్ అంటూ నీవు మాట్లాడిన మాటలకు నేను మద్దతు తెలుపుతున్నా. ఇలాంటి వెబ్‌సైట్లపై స్పందించడంలో ఇప్పటికే సినీ పరిశ్రమ చాలా ఆలస్యం చేసింది. సినీ పరిశ్రమ రక్తాన్ని వాళ్ళు జలగల్లా పీల్చేస్తున్నారు. నీ ప్రతిస్పందనకు కృతజ్ఞతలు. చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది'' అని పేర్కొన్నారు.

ఇక పూరీ జ‌గ‌న్నాథ్‌.. ఆకలితో ఉన్న ఎన్నో కుటుంబాలకి అన్నం పెట్టావ్ నువ్వు. ప్ర‌జ‌ల‌కి సాయం చేయాలనే త‌ప‌న ఉన్న మీరు విలువైన స‌మ‌యాన్ని, డ‌బ్బుని ఖ‌ర్చు చేశారు. ఈ విష‌యంలో మిమ్మ‌ల్ని గౌర‌విస్తాము. ప్ర‌స్తుతం మ‌నం యుద్ధ భూమిలో ఉన్నాము. దీనిపై మ‌నం పోరాడాలి. నువ్వు నా ఫైట‌ర్. నీకు మా మద్ద‌తు ఎల్ల‌ప్పుడు ఉంటుంది అని ట్వీట్ చేశారు 


logo