ఎంతో అద్భుతంగా సాగుతున్న తెలుగు సినిమా ప్రయాణానికి అనుకోని అడ్డంకిలా వచ్చింది కరోనా వైరస్. రెండేళ్ల కింది వరకు తెలుగు సినిమా బాలీవుడ్ స్థాయిని దాటి ఇండియన్ సినిమా స్థాయిని పెంచే పనిలో ఉంది. సరిగ్గా అలాంటి సమయంలోనే మాయదారి వైరస్ వచ్చి మొత్తం పాడు చేసింది. ఆ తర్వాత అన్ని ఇండస్ట్రీలు కుదేలైపోయాయి. కరోనా మొదటి దశ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు బాగానే వసూలు చేశాయి. రవితేజ క్రాక్, మాస్టర్, ఉప్పెన, జాతి రత్నాలు ఇలాంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే రెండోదశ మొదలైన తర్వాత మాత్రం ఇప్పటి వరకు సరైన విజయం రాలేదు.
ఈ మధ్యలో ఎస్ఆర్ కళ్యాణ మండపం, సీటీమార్ లాంటి సినిమాలు కాస్త ఊరటనిచ్చాయి కానీ నికార్సయిన విజయాలు మాత్రం కాదు. ఇలాంటి సమయంలో తెలుగు ఇండస్ట్రీ ఊగిపోయే విజయం కావాలి. నిర్మాతలు అందరూ తమ సినిమాలను విడుదల చేయాలని గట్టిగా నిర్ణయించుకొనే విజయం ఒకటి రావాలి. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా కోసం చాలా రోజుల నుంచి ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చేలా కనిపిస్తోంది. సెప్టెంబరు 24న నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైపోయింది.
విడుదల తేదీ దగ్గరికి వచ్చేసరికి అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరుగుతాయని నమ్ముతున్నారు నిర్మాతలు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. దానికి తోడు ఈ సినిమా బిజినెస్ కూడా 35 కోట్లకు పైగా జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని కోట్లు వసూలు చేయడం చిన్న విషయం కాదు. అయితే సినిమా అత్యద్భుతంగా ఉంటే తప్ప బాక్సాఫీసు దగ్గర ఈ స్థాయి వసూళ్లు రావు. లవ్ స్టోరీ కచ్చితంగా ఆ మాయ చేస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఒకవేళ అదే జరిగితే ఇండస్ట్రీ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సినిమా ఇదే అవుతుంది. ఇప్పటికే విడుదలైన లవ్ స్టోరీ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఏషియన్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rashmika Mandanna : రహస్యాల్ని బయటపెట్టను!
Bigg Boss: కాజల్‌కి ఫుల్ క్లాస్ పీకిన ప్రియ..ఎందుకో తెలుసా?
Bigg Boss: ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్స్ ఎవరో తెలుసా?
Idol Winner: ఇద్దరు భార్యలు,ఇద్దరు గార్ల్ ఫ్రెండ్స్‌ని సెట్ చేసుకున్న ఐడల్ విన్నర్
తమన్నాని అలా చూసి ఏడ్చేసిన దర్శకుడి కూతురు..!