సవతి పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు సినిమాకు సవతిపోరు మొదలైంది. అదే ఐపీఎల్.. ఎప్పుడో సమ్మర్ సీజన్లో ఉండాల్సిన ఈ క్రికెట్ పండగ కొవిడ్ కారణంగా 5 నెలలు ఆలస్యంగా వచ్చింది. ఇండియాలో ఉన్నవి రెండే రెండు మతాలు. ఒకటి క్రికెట్.. రెండు సినిమా. ఈ రెండూ కలిస్తే కాంబినేషన్ సూపర్ హిట్. కానీ ఈ రెండు పోటీ పడితే దర్శక నిర్మాతలకు చుక్కలే. ఇప్పుడు ఇదే జరుగుతుంది. కరోనా కారణంగా 2020 దారుణంగా నష్టపోయారు నిర్మాతలు. చాలామంది సినిమాలు విడుదల చేయలేక అలాగే బాక్సుల్లో ఉంచుకున్నారు. ఏదో సమయం కలిసి వస్తుంది కాబట్టి సినిమాలు విడుదల చేస్తున్నారు తెలుగు నిర్మాతలు. కానీ దానికి ఐపీఎల్ రూపంలో గట్టి పోటీ ఎదురు కానుంది.
ప్రతిసారి ఐపీఎల్ సినిమాలపై దారుణమైన ప్రభావం చూపిస్తుంది. ఈ సారి కూడా అదే జరగబోతుందేమో అని నిర్మాతలు భయపడుతున్నారు. సెప్టెంబర్ 19న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 రెండో దశ మొదలైంది. సెప్టెంబర్ 24న లవ్ స్టోరీ విడుదల కానుంది. ఆ తరువాత అక్టోబర్ 1న రిపబ్లిక్.. అక్టోబరు 8న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఐపీఎల్ సీజన్ అంటే మార్నింగ్, మ్యాట్నీ ఎలా ఉన్నా సాయంత్రం మాత్రం టీవీల ముందు అతుక్కుపోతారు యూత్. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇది కలెక్షన్స్‌పై భారీ ప్రభావం చూపించడం ఖాయం. అక్టోబర్ చివరి వరకు ఐపీఎల్ జరగనుంది. కచ్చితంగా ప్రతీ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనడంలో ఆశ్చర్యం లేదు. దాంతో ఇప్పుడు నిర్మాతలకు గుబులు మొదలైంది.
ఐపీఎల్ తమ సినిమా వసూళ్లపై ఎక్కడ ప్రభావం చూపిస్తుందో అని టెన్షన్ పడుతున్నారు నిర్మాతలు. ఒక్కటి రెండు కాదు.. ఏకంగా నెల పాటు సాగనుంది ఈ భారీ క్రికెట్ టోర్నమెంట్. ఇలాంటి టైమ్ లో ముఖ్యంగా ఫస్ట్ అండ్ సెకండ్ షోలకు కలెక్షన్లు తగ్గే ప్రమాదం కూడా ఉంది. గతంలోనూ ఐపీఎల్ పుణ్యమా అని కొన్ని సినిమాలకు వసూళ్లు రాలేదు. ఇప్పుడు కూడా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఐపీఎల్ సీజన్ అందర్నీ భయపెడుతుంది. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలపై క్రికెట్ ప్రభావం పడటం దాదాపు ఖాయం. మరి ఈ సారి ఐపీఎల్ పోటీ నుంచి మన సినిమాలెలా తట్టుకుంటాయో చూడాలిక..!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ విషయంలో మా అమ్మ చెప్పినా వినను.. ఓపెన్ అయిన రష్మిక
చీరలు అంటే చాలా ఇష్టమే.. కానీ అదొక్కటే సమస్య అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్
Siri: సిరి షర్ట్ లోపల చేయి పెట్టిందెవరు.. వీడియో చూపించి గుట్టు విప్పిన నాగ్
తల్లిదండ్రులపై కేసు పెట్టిన తమిళ హీరో విజయ్.. కారణం ఏంటంటే..