మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 09, 2020 , 11:28:24

ప‌వ‌న్ తో 20ఏళ్ల కింద‌టే ప‌నిచేసిన వేణుశ్రీరామ్‌

ప‌వ‌న్ తో 20ఏళ్ల కింద‌టే ప‌నిచేసిన వేణుశ్రీరామ్‌

ఓ మై ఫ్రెండ్‌, ఎంసీఏ వంటి చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నాడు యువ డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్. ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో వ‌కీల్ సాబ్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ డిసెంబ‌ర్ లో రీస్టార్ట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. తాజాగా ఓ టీవీ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వేణు శ్రీరామ్ ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెప్పాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో 20 ఏళ్ల కింద‌టే ఉన్న వ‌ర్క్ ఎక్స్ పీరియ‌న్స్ ను షేర్ చేసుకున్నాడు. ఖుషి సినిమా విడుద‌ల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాపుల‌ర్ డ్రింక్ కోలా బ్రాండ్ కు అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు.

యాడ్ ఫిల్మ్ కు వేణుశ్రీరామ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేస్తున్నాడ‌ట‌. యాడ్ కోసం ప‌వ‌న్ డ‌బ్బింగ్ ప‌నులను ప‌ర్య‌వేక్షించార‌ట వేణుశ్రీరామ్‌. త‌న ఫేవ‌రెట్ యాక్ట‌ర్ తో ప‌ని చేయ‌డం కొంత న‌ర్వ‌స్ గా అనిపించినా..ఫ్యాన్ మూవ్ మెంట్ తెగ ఎంజాయ్ చేశాన‌ని చెప్పుకొచ్చాడు వేణు శ్రీరామ్‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo