ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 13, 2020 , 16:17:42

'ఆహా' కోసం ప‌నిచేయ‌నున్న యువ‌ద‌ర్శ‌కుడు..!

'ఆహా' కోసం ప‌నిచేయ‌నున్న యువ‌ద‌ర్శ‌కుడు..!

థియేట‌ర్లు తాత్కాలిక మూత‌ప‌డ‌టంతో ప్ర‌స్తుత ప‌రిస్తితుల్లో డిజిటల్ ప్లాట్ ఫాంల ప్రాముఖ్య‌త పెరుగుతుంది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ తెలుగు కంటెంట్ కు ప్రాధాన్య‌మిస్తూ లాంచ్ చేసిన ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా. ఈ ప్లాట్ ఫాంతో ప‌లువురు యువ ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇస్తున్నారు అల్లు అర‌వింద్. ఈ నిర్మాత తాజాగా ఓ యువ డైరెక్ట‌ర్ తో భాగ‌స్వామ్యం తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. నీది నాది ఒకే కథ సినిమాతో డైరెక్ట‌ర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు ఊడుగుల‌. ప్ర‌స్తుతం రానా, సాయిప‌ల్ల‌వి కాంబోలో విరాట‌ప‌ర్వం సినిమా తీస్తున్నాడు. 

నిర్మాత అల్లుఅర‌వింద్ డైరెక్ట‌ర్ వేణు ఊడుగులతో ఆహా కోసం కొన్ని ఒరిజిన‌ల్ సిరీస్, సినిమాలు చేయాల‌పి అడిగార‌ట‌. అయితే వేణు మాత్రం డైరెక్ష‌న్ కాకుండా నిర్మాతగా వ్య‌వ‌హ‌రించాల‌నుకుంటున్న‌ట్టు వార్త టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. చ‌లం రాసిన మైదానం ఆధారంగా వేణు ఊడుగుల త‌న స్నేహితుడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ ప్రాజెక్టుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు టాక్‌. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కొన‌సాగుతున్న‌ట్టు స‌మాచారం. ప‌లువురు స్టార్ హీరోయిన్ల‌తో చ‌ర్చ‌లు కూడా కొన‌సాగుతున్న‌ట్టు టాక్. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo