శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 17:56:19

అనురాగ్ కాశ్య‌ప్ నాకు 20 ఏళ్లుగా తెలుసు: వ‌ర్మ‌

అనురాగ్ కాశ్య‌ప్ నాకు 20 ఏళ్లుగా తెలుసు: వ‌ర్మ‌

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ కాశ్య‌ప్ త‌న‌పై లైంగిక దాడి చేశానంటూ న‌టి పాయ‌ల్ ఘోష్ ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అనురాగ్ కాశ్య‌ప్ దీన్ని తీవ్రంగా ఖండించారు. కాశ్య‌ప్ పై మీటూ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ అనురాగ్ కాశ్య‌ప్ కు మ‌ద్ద‌తుగా నిలిచాడు. అనురాగ్ కాశ్య‌ప్ నాకు బాగా తెలిసిన వ్య‌క్తి. చాలా సున్నిత‌మైన‌, భావోద్వేగ‌పూరిత‌మైన వ్య‌క్తి. 20 ఏండ్లుగా నాకు తెలుసు. అత‌డు ఎవ‌రిని ఇబ్బందిపెట్టిన‌ట్టు నేనెప్పుడూ విన‌లేదు, చూడ‌లేదు.

ప్ర‌స్తుతం ఏం జ‌రుగుతుందో నిజంగా తెలియ‌డం లేదని వ‌ర్మ ట్వీట్ చేశాడు. బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత హ‌న్సాల్ మెహ‌తా, వాస‌న్ బాలా, అనుభ‌వ్ సిన్హాతోపాటు కాశ్య‌ప్ మాజీ భార్య‌లు ఆర్తి బ‌జాజ్, క‌ల్కి కొయెచ్లిన్‌, తాప్సీప‌న్ను, టిస్కా చోప్రా, సుర్వీన్ చావ్లా, మ‌హీ గిల్ మ‌ద్ద‌తుగా నిలిచారు 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.