శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 20:19:20

ప‌వ‌న్ అయితే డైలాగ్స్ రాస్తాన‌న్న త్రివిక్ర‌‌మ్‌..!

 ప‌వ‌న్ అయితే డైలాగ్స్ రాస్తాన‌న్న త్రివిక్ర‌‌మ్‌..!

టాలీవుడ్ లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుందంటే చాలు అభిమానుల ఆనందానికి అవ‌ధులుండ‌వు. ప‌వ‌న్ త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా వ‌రుస‌గా మూడు ప్రాజెక్టుల అప్ డేట్స్ ను ప్ర‌క‌టించాడు. తాజాగా ప‌వ‌న్ కు సంబంధించిన మ‌రో హాట్ న్యూస్ ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప‌వ‌న్ కోసం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మ‌రోసారి పెన్ను, పేప‌ర్ పట్టేందుకు రెడీ అవుతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. త‌మిళంలో హిట్ గా నిలిచిన అయ్య‌ప్ప‌నుమ్ కొషియ‌మ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే హీరోల విష‌యంలో సందిగ్ధ‌త నెల‌కొన‌డంతో ప‌వ‌న్ పేరును ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేస్తే బాగుంటుంద‌ని వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఒక‌వేళ ప‌వ‌న్ ఈ చిత్రంలో న‌టించేది క‌న్ఫామ్ అయితే త్రివిక్ర‌మ్ రీమేక్ చిత్రానికి సంభాష‌ణ‌లు రాసేందుకు రెడీగా ఉన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం చేతినిండా స‌మ‌యముండ‌టంతో డైలాగ్స్ రాస్తాన‌ని చెప్పాడ‌ట త్రివిక్ర‌మ్‌. ల‌వ్ ఆజ్ క‌ల్ కు తెలుగు రీమేక్ గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన‌ తీన్మార్ సినిమాకు డైలాగ్స్ అందించాడు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు