తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ ముందుంటాడు. రాజమౌళి తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఉన్న దర్శకుడు ఈయనే. సింపుల్ కథలను ఎమోషనల్‌గా డీల్ చేసి సంచలన విజయాలు అందుకుంటాడు ఈయన. అసలు ఈ కథలతో కూడా ఇండస్ట్రీ హిట్స్ కొట్టొచ్చా అనేలా కుటుంబ కథా చిత్రాలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఇదిలా ఉంటే ఈయన ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. ఓ సినిమా పూర్తయ్యే లోపు మరో రెండు మూడు సినిమాలను లైన్లో పెడుతుంటాడు. హీరోలు కూడా ఈయనతో సినిమా చేయడానికి పోటీ పడుతుంటారు. కాకపోతే ఈయన కొందరు హీరోలతోనే ఫిక్స్ అయిపోతాడనే విమర్శలు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్, పవన్, మహేష్ బాబు లాంటి హీరోలతోనే ఎక్కువ సినిమాలు చేసిన ఈయన.. మిగిలిన హీరోలను అస్సలు పట్టించుకోలేదు.
ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు. మూడేళ్ల కింద ఈయనతో ‘అరవింద సమేత’ సినిమా చేసిన త్రివిక్రమ్.. అప్పుడే రెండో సినిమాను మొదలు పెడుతున్నాడు. ‘అయిననూ పోయిరావలె హస్తిన’కు సినిమాతో రాబోతున్నారు. మరోవైపు మహేష్ బాబుతో కూడా ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే వీళ్ల కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. అతడు, ఖలేజా సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ జోడీ. ఈ రెండు సినిమాలు కూడా టీవీలో చరిత్ర సృష్టించాయి.
అయితే కొన్నేళ్ల కింద త్రివిక్రమ్, మహేష్ మధ్య ఏదో గొడవ జరిగిందని.. అందుకే కలిసి పని చేయడం లేదనే వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు మాటల మాంత్రికుడు.
ఎన్టీఆర్ సినిమా తర్వాత తనతోనే సినిమా చేయాలంటూ త్రివిక్రమ్‌ను మహేష్ కోరుతున్నాడని ప్రచారం జరుగుతుంది. కాకపోతే ఈ సినిమాను ఆర్నెళ్లలోనే పూర్తి చేయాలని అడుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమాకు కమిటయ్యాడు మహేష్ బాబు. ఈ సినిమాను ఇదే ఏడాది పూర్తి చేయనున్నాడు. మరోవైపు ఈ సినిమా తర్వాత వెంటనే త్రివిక్రమ్, మహేష్ సినిమా మొదలు కానుంది.
మరోవైపు ఎన్టీఆర్ సినిమాను కూడా త్రివిక్రమ్ జూన్‌లో మొదలు పెట్టి జనవరిలోపు పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఏదేమైనా కూడా ఈ కాంబినేషన్ రిపీట్ అయితే మాత్రం అంతకంటే ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్ మరోటి ఉండదేమో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆదిపురుష్ : గ్రీన్ మ్యాట్తోనే సగానికి పైగా సినిమా
చరణ్‌తో స్టైలిష్ ఫొటో దిగిన ఎన్టీఆర్.. పిక్ వైరల్
థ్యాంక్యూ బ్రో అంటూ అనుష్క ట్వీట్
అమెరికాలో రెస్టారెంట్ పెట్టిన ప్రియాంకా చోప్రా
‘అరణ్య’ ఫస్ట్ డే కలెక్షన్స్.. రానా దగ్గుబాటికి మరోసారి నిరాశే!
వాయిదా పడ్డ గోపిచంద్ సీటీమార్
సీనియర్ హీరోయిన్ తో ఎఫైర్ .. నిజనిజాలేంటో చెప్పిన కమెడీయన్
హిందీలో మాట్లాడిన యాంకర్‌ను ట్రోల్ చేసిన ఏఆర్ రెహమాన్
మాట మార్చిన బన్నీ కూతురు .. వైరల్‌గా మారిన వీడియో
రెస్టారెంట్ వద్ద విజయ్‌దేవరకొండ, రష్మిక..ఫొటోలు హల్చల్