ఆదివారం 24 జనవరి 2021
Cinema - Nov 23, 2020 , 21:24:51

టైం ఫిక్స్ చేసిన సురేంద‌ర్ రెడ్డి..!

టైం ఫిక్స్ చేసిన సురేంద‌ర్ రెడ్డి..!

టాలీవుడ్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి యువ న‌టుడు అక్కినేని అఖిల్ తో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రానున్న ఈ ప్రాజెక్టును ఇటీవ‌లే అధికారికంగా ప్ర‌క‌టించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 2021 జ‌న‌వ‌రి చివ‌ర‌లో ఈ చిత్రం సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తూ స్పీడుమీదున్న క‌న్న‌డ సోయం ర‌ష్మిక మంద‌న్నాను హీరోయిన్ గా అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ పై అనిల్ సుంక‌ర ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. అఖిల్-పూజాహెగ్డే కాంబోలో వ‌స్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo