ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 19, 2020 , 14:15:24

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల కోసం ప్రేమ‌క‌థలు

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల కోసం ప్రేమ‌క‌థలు

సుకుమార్ డైరెక్ష‌న్‌లో పుష్ప చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పుష్ప ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు సుకుమార్‌. నవంబ‌ర్ లేదా డిసెంబ‌ర్ లో షూటింగ్ రీస్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే సుకుమార్ ఈ సమయంలో  ‌ల‌వ్ స్టోరీస్ ను ‌సిద్దం చేస్తున్నాడ‌ట‌. ఓటీటీ ప్లాట్ ఫాం కోసం సుకుమార్ 9 చిన్న ప్రేమ‌క‌థ‌ల స‌మాహారంతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.

మాజీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్ ప‌ల్నాటి సూర్యప్ర‌తాప్ (కుమారి 21ఎఫ్), బుచ్చి బాబు సాన (ఉప్పెన‌)తో డైరెక్ష‌న్ లో ఈ ప్రాజెక్టులు చేయ‌నున్నాడు. ఈ ప్రేమ‌క‌థ‌లు ఎప్ప‌డు తెరపై సంద‌డి చేస్తాయ‌నేది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo