ఆదివారం 17 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 18:05:02

సెల్ఫ్ ఐసోలేష‌న్ లోకి సుకుమార్..!

సెల్ఫ్ ఐసోలేష‌న్ లోకి సుకుమార్..!

టాలీవుడ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్ తో క‌లిసి పుష్ప సినిమా తీస్తున్న విష‌యం తెలిసిందే. ఆంధ్రప్ర‌దేశ్‌లోని మారెడుమిల్లిలో షూటింగ్ జ‌రుగుతోంది. అయితే ప్రొడ‌క్ష‌న్ టీంలో ప‌నిచేస్తున్న ఓ వ్య‌క్తి ఇటీవ‌లే చ‌నిపోయాడు..అత‌నికి క‌రోనా పాజిటివ్ గా తేలింది. దీంతో పుష్ప షూటింగ్ ను నిలిపేసింది సుకుమార్ అండ్ టీం. షూటింగ్ ర‌ద్దు చేసుకుని వెంట‌నే హైద‌రాబాద్ కు చేరుకుంద‌ట‌. సుకుమార్ ఒక వారంపాటు సెల్ఫ్ ఐసోలేష‌న్ లోకి వెళ్లిపోయార‌ట‌. అంతేకాదు ఓ వారం త‌ర్వాత మ‌రోసారి కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోనున్న‌ట్టు టాక్. 

చ‌నిపోయిన టీం స‌భ్యుడు అల్లు అర్జున్ తో కాంటాక్ట్ అవ‌లేద‌ని తెలుస్తోంది. అయితే షూటింగ్ జ‌రుగుతున్నపుడు మిగిలిన టీం మెంబ‌ర్స్..స‌ద‌రు వ్య‌క్తితో స‌న్నిహితంగా మెలిగార‌ట‌. షూటింగ్ క‌రోనా ఎఫెక్ట్ తో ఆల‌స్యంగా ప్రారంభ‌మ‌వ‌గా..తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో పుష్ప షూటింగ్ మ‌రింత ఆల‌స్యం కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.