శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 21:24:32

మహేష్ ను వద‌లంటున్న డైరెక్ట‌ర్ సుకుమార్..!

మహేష్ ను వద‌లంటున్న డైరెక్ట‌ర్ సుకుమార్..!

ఇండస్ట్రీలో సుకుమార్ లాంటి దర్శకుడితో సినిమా చేయాలని ప్రతీ హీరో ఆశ పడుతుంటారు. రాజమౌళి కూడా ఈయన టేకింగ్ అంటే భయపడతాడు. ఒక్కసారి సుకుమార్ క్రియేటివ్ సైడ్ కాకుండా మాస్ సినిమా చేస్తే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తాడని రాజమౌళి ఎప్పుడో చెప్పాడు. అన్నట్లుగానే రంగస్థలంతో చేసి చూపించాడు సుకుమార్. ఆ సినిమా తర్వాత వెంటనే మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించాల్సి ఉంది. అయితే ఆ సమయంలో సుకుమార్ సినిమా అంటే చాలా ఆలస్యం అయిపోతుందని భావించిన మహేష్ బాబు.. తన మనసు మార్చుకుని అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు చేసి సేఫ్ గేమ్ ఆడాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లిని కూడా కాదని ఇప్పుడు పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం సుకుమార్ మాత్రం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ హీరోగా ప్యాన్ ఇండియన్ సినిమాగా దీన్ని రూపొందిస్తున్నాడు సుకుమార్. మహేష్ బాబు కాదనుకున్న కథతోనే ఇప్పుడు పుష్ప చేస్తున్నాడు సుకుమార్. అందులో మరీ డీ గ్లామరైజ్ పాత్ర కావడంతో మహేష్ నో చెప్పాడని ప్రచారం జరుగుతుంది. అయితే గతంలోనే నేనొక్కడినే సినిమాకు కలిసి పని చేసారు ఈ జోడీ. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా అలాంటి సినిమా తన కెరీర్ లో మళ్లీ చేయలేనని.. వన్ నేనొక్కడినే తనకు చాలా ప్రత్యేకం అని చెప్పాడు మహేష్ బాబు. సుకుమార్ ఎప్పుడంటే అప్పుడు డేట్స్ ఇస్తానంటూ చెప్పాడు. కానీ మహేష్ బాబు ఇచ్చిన మాట తప్పాడు. 

అయినా కూడా సుకుమార్ మాత్రం అదే మాట మీద ఉన్నాడు. తాజాగా మరోసారి మహేష్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. పుష్ప తర్వాత విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ సినిమా చేయాల్సి ఉంది. విజయ్ తర్వాత మహేష్ బాబుతోనే నెక్ట్స్ సినిమా చేయనున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఈ సారి మహేష్ నో అనలేని సబ్జెక్టుతో వెళ్తున్నాడని తెలుస్తుంది. మరోవైపు మహేష్ బాబు కూడా ప్రస్తుతం సర్కారు వారి పాట తర్వాత తర్వాతి సినిమా ఏదీ కన్ఫర్మ్ చేయలేదు. ఆ లోపు సుకుమార్ కథ నచ్చితే ఓకే చెప్తాడేమో తెలియదు మరి. ఏదేమైనా కూడా మహేష్ బాబును మాత్రం వదిలే సమస్యే లేదంటున్నాడు లెక్కల మాస్టారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.