బుధవారం 24 ఫిబ్రవరి 2021
Cinema - Jan 18, 2021 , 17:46:25

సురేంద‌ర్ రెడ్డికి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

సురేంద‌ర్ రెడ్డికి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

కిక్‌, రేసుగుర్రం, సైరా చిత్రాలను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించి స్టార్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా మారిపోయాడు సురేంద‌ర్ రెడ్డి. ఈ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఓ సినిమాకు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. సురేంద‌ర్ రెడ్డి  ఇటీవ‌లే ప‌వ‌న్‌కల్యాణ్ ను క‌లిసి క‌థ‌ను వినిపించ‌గా..ప‌వ‌న్ కు స్టోరీ న‌చ్చింద‌ట‌. వెంట‌నే ఈ సినిమా చేద్దామ‌ని సురేంద‌ర్‌రెడ్డికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టాక్.

మ‌రోవైపు సురేంద‌ర్‌రెడ్డి ఇప్ప‌టికే అఖిల్ తో యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ను లైన్ లో పెట్టాడు. అఖిల్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా పూర్తిచేసిన వెంట‌నే సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. ప‌వ‌న్ కూడా వ‌కీల్‌సాబ్ పూర్తి చేసిన నేప‌థ్యంలో క్రిష్ తో చేయ‌బోయే చిత్రంపై ఫోక‌స్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాల త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి-ప‌వ‌న్ సినిమా ట్రాక్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు లేటెస్ట్ టాక్.

ఇవి కూడా చ‌ద‌వండి

నెగెటివ్ షేడ్స్ పాత్ర‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌..?

ప‌వ‌న్ తో ఐశ్వ‌ర్య‌రాజేశ్ ప్రేమ‌లో ప‌డ‌నుందా..?

గోపాల గోపాల డైరెక్ట‌ర్ తో ప‌వ‌న్‌ వ‌న్స్‌మోర్..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo