సోమవారం 18 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 16:54:54

చిరంజీవి లేకుండా షూటింగ్ షురూ..!

చిరంజీవి లేకుండా షూటింగ్ షురూ..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి-మెహ‌ర్ ర‌మేశ్ కాంబినేష‌న్‌లో వేదాళం రీమేక్ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆచార్య షూటింగ్ పై చిరంజీవి ఫోక‌స్ పెట్ట‌గా..మెహ‌ర్ ర‌మేశ్ రీమేక్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లు పెట్టాడు. ఈ ప్రాజెక్టుపై ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మెహ‌ర్ ర‌మేశ్ చిరంజీవి లేకుండా వ‌చ్చే సీన్ల‌ను షురూ చేశాడ‌ని టాక్‌. కోల్ క‌తా బ్యాక్ డ్రాప్ లో సినిమా కొన‌సాగ‌నుండ‌గా..క‌థాన‌గుణంగా తెలుగు వెర్ష‌న్ ను కూడా అక్క‌డే తెర‌కెక్కించాల‌ని మెహ‌ర్ ర‌మేశ్ ప్లాన్ చేశాడ‌ట‌.

అక్టోబ‌ర్ లో ద‌స‌రా సంద‌ర్భంగా మెహ‌ర్ ర‌మేశ్ అండ్ టీం దుర్గా టెంపుల్ ద‌గ్గ‌ర ఫెస్టివ‌ల్ సెల‌బ్రేష‌న్స్ లో కూడా పాల్గొన్న‌ది. ఆచార్య పూర్త‌వ‌గానే వేదాళం రీమేక్ దృష్టిపెట్ట‌నున్నాడు చిరు. ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై అనిళ్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌‌రోవైపు లూసిఫ‌ర్ రీమేక్ ను మొద‌లుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్టు టాలీవుడ్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.