శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 28, 2020 , 13:30:11

ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ కు రాజ‌మౌళి అల్టిమేటం..!

ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ కు రాజ‌మౌళి అల్టిమేటం..!

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్.. ర‌ణం రౌద్రం రుధిరం. రాంచ‌ర‌ణ్-ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. తార‌క్‌, చెర్రీల‌కు రాజ‌మౌళి ఓ అల్టిమేటం జారీచేశార‌ట‌. తార‌క్‌, ఎన్టీఆర్ త‌మ షూటింగ్ రోజుల‌ను లెక్క‌పెట్టుకుంటూ..త‌మ‌కు ఎప్పుడు విశ్రాంతి దొర‌కుతుందా అని ఎదురుచూస్తుంటే. జ‌క్క‌న్న మాత్రం ఆర్ఆర్ఆర్ విడుద‌ల‌య్యే వ‌ర‌కు గెట‌ప్ ల‌ను కొన‌సాగించాల‌ని తార‌క్, చెర్రీల‌కు అల్టిమేటం జారీచేసిన‌ట్టు టాక్ న‌డుస్తోంది.

ఎన్టీఆర్ త్వ‌ర‌లోనే సినిమా పూర్తి చేసి.. త‌నతో క‌లిసి ప‌నిచేస్తాడ‌ని త్రివిక్ర‌మ్ అనుకుంటుండ‌గా..జ‌క్క‌న్న నిర్ణ‌యంతో ఎన్టీఆర్ షూటింగ్ పూర్తయిన 4-5 నెల‌ల త‌ర్వాత గానీ షూటింగ్ లో  పాల్గొన‌డ‌ని చ‌ర్చ న‌డుస్తోంది. ఇక ఇదే ఫార్ములా రాంచ‌ర‌ణ్ విష‌యంలోనూ వ‌ర్తించేలా ప్లాన్ చేశాడ‌ట జ‌క్క‌న్న‌. ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్‌-రాంచ‌ర‌ణ్ 2021 ఫ‌స్ట్ హాఫ్ వ‌ర‌కు కొత్త సినిమాల షూటింగ్ లో పాల్గొన‌డం క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.