తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. వాళ్లు కలిసి పని చేస్తున్నారు అంటే అంచనాలు కూడా అలాగే ఉంటాయి. టాలీవుడ్లో అలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ మహేశ్ బాబు, శ్రీను వైట్ల. పదేళ్ల కింద ఇద్దరు కలిసి చేసిన దూకుడు సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాట్రిక్ ప్లాపులతో డైలమాలో ఉన్న మహేశ్ బాబు కెరీర్ కు ఊపిరిలూదిన సినిమా దూకుడు. ఈ సినిమాతో శ్రీనువైట్ల రేంజ్ కూడా మారిపోయింది. అప్పటివరకు 20 కోట్ల రేంజ్లో ఉన్న ఈయన.. 50 కోట్ల సినిమా ఇచ్చాడు. దూకుడు తర్వాత వరుసగా శ్రీనువైట్లకు స్టార్ హీరోలు అవకాశం ఇచ్చారు.
దూకుడు సినిమా వచ్చిన మూడేళ్ల తర్వాత ఆగడు అంటూ ఈ కాంబినేషన్లో మరో సినిమా వచ్చింది. ఇక్కడి నుంచి శ్రీను వైట్ల బ్యాడ్ టైం మొదలైంది. దూకుడుతో టాప్ రేంజ్‌కు వెళ్లి పోయిన శ్రీనువైట్ల.. ఆగడు తర్వాత దర్శకుడిగా దిగజారుతూ వచ్చాడు. ఆ తర్వాత చేసిన బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ఢీ సీక్వెల్ చేస్తున్నాడు శ్రీను వైట్ల. దీంతో పాటు మరో సినిమా కూడా చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే మహేశ్ బాబుతో సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు శ్రీను వైట్ల. ఖచ్చితంగా త్వరలోనే మహేశ్‌ను కలిసి కథ చెప్పి ఒప్పిస్తాను అంటూ నమ్మకంగా చెబుతున్నాడు ఈ దర్శకుడు. అయితే ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేశ్ అవకాశం ఇవ్వడం దాదాపు అసాధ్యం. సరే తనకు దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాడు అని సాఫ్ట్ కార్నర్‌తో కథ నచ్చితే అవకాశం ఇచ్చినా ఇవ్వచ్చు.. కానీ అది జరగాలంటే మంచు విష్ణుతో చేస్తున్న సినిమా సూపర్ హిట్ అవ్వాలి. అప్పుడు మళ్లీ శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అంటారు అభిమానులు. నిజానికి మహేశ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మీరు నవ్వితే ప్రపంచం ఆగిపోతుంది..దీపికాపదుకొనే స్టిల్‌పై అభిమాని
తండ్రి, కొడుకుల మధ్య ముదురుతున్న వివాదం.. ఆందోళనలో విజయ్ ఫ్యాన్స్
మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, పవన్ అంతా నాకే ఓటేస్తారు: మంచు విష్ణు
Pawan Kalyan: దసరాకి పట్టాలెక్కనున్న భవదీయుడు భగత్ సింగ్..!