బుధవారం 23 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 20:04:01

విలేజ్‌సెట్ వేయిస్తోన్న శేఖ‌ర్ క‌మ్ముల‌..!

విలేజ్‌సెట్ వేయిస్తోన్న శేఖ‌ర్ క‌మ్ముల‌..!

నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో ల‌వ్ స్టోరీ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర వార్త ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. క‌రోనా ఎఫెక్ట్ తో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్‌..అక్టోబ‌ర్ మూడో వారంలో తిరిగి షురూ కానున్న‌ట్టు తెలుస్తోంది.  అంతేకాదు ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీ లో ప్ర‌త్యేకంగా ఓ విలేజ్ సెట్ ను వేయిస్తున్నాడ‌ట శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈ సెట్ లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్‌. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే వెయిట్ చేయాలి. 

ఇద్ద‌రు డ్యాన్స‌ర్ల జీవ‌న శైలిని తెలిపే విధంగా ల‌వ్ స్టోరీ సినిమా క‌థ సాగ‌నుందని ఇన్ సైడ్‌టాక్‌. శేఖ‌ర్ క‌మ్ముల గ‌తంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కోసం ప‌ద్మారావు న‌గ‌ర్ ఏరియాలో ఎందుకు ప‌నికి రాని స్థ‌లంలో ఏకంగా అంద‌మైన కాల‌నీనే సృష్టించాడు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo