మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 12, 2020 , 17:11:02

సంపత్‌ నంది వెబ్‌సిరీస్‌..ఈషా రెబ్బా లీడ్‌ రోల్ ‌?

సంపత్‌ నంది వెబ్‌సిరీస్‌..ఈషా రెబ్బా లీడ్‌ రోల్ ‌?

థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం సినిమాల హవా నడుస్తోంది. డైరెక్టర్‌ తన సొంత నిర్మాణ సంస్థలో ఓ వెబ్‌సిరీస్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సంపత్‌ నంది ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశాడట. ఈషారెబ్బ లీడ్‌ రోల్‌లో నటించనున్న ఈ సినిమా రాత్రివేళ హైదరాబాద్‌ జీవనశైలిని ప్రతిబింబించే విధంగా సాగుతుందని తెలుస్తోంది.

అయితే ఈషా రెబ్బ ప్రస్తుతం హిందీలో సూపర్‌హిట్‌ చిత్రం ‘లస్ట్‌ స్టోరీస్’‌ రీమేక్‌ వెబ్‌సిరీస్‌తో బిజీగా ఉంది. ఈ నేప‌థ్యంలో మరి సంపత్‌ నంది చిత్రంలో ఈషారెబ్బ నటిస్తుందా..? లేదా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo