వరస ఫ్లాపులు వచ్చినా.. కెరీర్లో కింద పడిపోయినా మళ్లీ పైకి లేచి నిలబడే సత్తా ఉన్న దర్శకుడు పూరీ జగన్నాథ్. మన దగ్గర మ్యాటర్ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉన్నా భయపడకూడదు అన్న దానికి ఈయన నిదర్శనం. తెలుగులో దాదాపు జీరోకి పడిపోయి మళ్లీ అక్కడి నుంచి ఇప్పుడు హీరో అయ్యాడు పూరి. రెండేళ్ల కింద ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ తానేంటో నిరూపించుకున్నాడు. టెంపర్ తర్వాత సరైన సక్సెస్ లేని పూరీ.. రామ్ సినిమాతో మాస్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ జగన్నాథ్ కెరీర్ మళ్లీ గాడిన పడింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ సగానికిపైగా పూర్తయింది. పాన్ ఇండియా లెవల్లో దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరీ జగన్నాథ్. హిందీలో కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తర్వాత పూరి ఏ హీరోతో సినిమా చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించాయి. కానీ ఎవరితో కన్ఫామ్ కాలేదు. టాలీవుడ్లో ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి పేర్లు కూడా వచ్చాయి. అలాగే కన్నడ హీరో యశ్ తో జనగణమన సినిమా చేస్తాడని కూడా వార్తలు వచ్చాయి.
అయితే మరో రెండు మూడేళ్ల వరకు వాళ్ల డైరీ ఫుల్ అయిపోయింది. దాంతో ఆయన కన్నడ ఇండస్ట్రీకి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, కన్నడ హీరో ధ్రువ సర్జాతో ఒక ద్విభాషా చిత్రం చేయడానికి పూరి జగన్నాథ్ సన్నాహాలు చేసుకుంటున్నారని టాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
పూరీకి కన్నడ ఇండస్ట్రీ కొత్త కాదు. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా వెలిగిపోతున్న పునీత్ రాజ్ కుమార్‌ను ఈయనే అప్పు సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ తర్వాత కూడా రెండు సినిమాలు చేశాడు పూరీ. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత కన్నడ ఇండస్ట్రీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ధ్రువ సర్జాతో పూరీ జగన్నాథ్ ఎలాంటి సినిమా తెరకెక్కిస్తాడో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఐశ్వర్యరాజేశ్ ఫైనల్..మరో హీరోయిన్ కోసం వేట..!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..!
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
ముద్దు వీడియో షేర్ చేసిన జెనీలియా.. స్పందించిన ప్రీతి
ఈ ఇద్దరు కొత్త హీరోయిన్ల సుడి పీక్స్.. స్టార్ హీరోలతో ఆఫర్స్
తరుణ్ రీఎంట్రీ.. లవ్ స్టోరీతో వస్తున్నాడంట
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…
‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్
జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
పవన్ సినిమా హిట్ అయితేనే బన్నీ అతడికి ఛాన్స్ ఇస్తాడా?
నేను సున్నితమైన వ్యక్తిని: అదితీరావు హైదరి