శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 15:38:27

మెహ‌ర్ ర‌మేశ్-చిరంజీవి మూవీపై ప‌వ‌న్ అప్ డేట్‌

మెహ‌ర్ ర‌మేశ్-చిరంజీవి మూవీపై ప‌వ‌న్ అప్ డేట్‌

టాలీవుడ్ డైరెక్ట‌ర్ మెహర్‌ రమేశ్ మెగాస్టార్ చిరంజీవితో  సినిమా చేయ‌నున్నాడ‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. చిరు బ‌ర్త్ డేన ఈ‌ ప్రాజెక్టును ప్రకటిస్తాడని ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొట్టినా..ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. దీంతో ఈ మూవీ అస‌లు ప‌ట్టాలెక్కుతుందా..? ల లేదా అనే డైలామాలో ప‌డ్డారు మెగాఫ్యాన్స్. తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీనిపై అభిమానుల‌కు క్లారిటీ ఇచ్చాడు. త‌న పుట్టిన‌రోజున శుభాకాంక్ష‌లు తెలిపిన మెహ‌ర్ ర‌మేశ్ కు ప‌వ‌న్ ధ‌న్యవాదాలు తెలిపాడు.

చిరంజీవి సినిమాతో రీఎంట్రీ ఇస్తోన్న మెహ‌ర్ ర‌మేశ్ కు విషెస్ చెప్పాడు ప‌వ‌న్‌. దీంతో చిరంజీవితో మెహ‌ర్ ర‌మేశ్ సినిమా ఖాయ‌మైపోయిన‌ట్టేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. 2013లో వెంకటేశ్‌ హీరోగా నటించిన షాడో చిత్రం తర్వాత మళ్లీ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకోనున్నాడు డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.