శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 17, 2021 , 19:08:36

వకీల్‌సాబ్ పై ఆశ‌లు పెట్టుకున్న మారుతి..!

వకీల్‌సాబ్ పై ఆశ‌లు పెట్టుకున్న మారుతి..!

టాలీవుడ్ లో గోపీచంద్‌, మారుతీ కాంబోలో సినిమా ఇప్ప‌టికే అనౌన్స్ అయింది. ఈ క్రేజీ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కోర్టు రూం డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌. ఇప్ప‌టికే తెలుగులో కోర్టు వార్ నేప‌థ్యంలో వ‌కీల్‌సాబ్ వ‌స్తోంది. త్వ‌ర‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అయితే తాను చేయ‌బోయే చిత్రానికి వ‌కీల్‌సాబ్ మంచి బూస్ట్‌లాగా ప‌నిచేస్తుంద‌ని భావిస్తున్నాడ‌ట మారుతి ‌. 

మారుతి-గోపీచంద్ ప్ర‌‌‌స్తుతం వ‌కీల్‌సాబ్‌పై చాలా ఆశ‌లు పెట్టుకున్నార‌ని ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ నడుస్తోంది. మారుతి ఈ సారి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో కోర్టు నేప‌థ్యంలో గోపీచంద్ తో సినిమా చేయబోతున్నాడు. వ‌కీల్‌సాబ్‌ను ప్రేక్ష‌కులు హిట్ చేస్తే..ప్రేక్ష‌కులు కోర్టు  డ్రామాల‌ను ఆద‌రిస్తున్న‌ర‌డానికి పాజిటివ్ సంకేతం అని చెప్పొచ్చు. అలా అయితే ఈ జోన‌ర్ లో సినిమా తీయాల‌నుకున్న వారికి కూడా ఎన‌ర్జీ ఇచ్చిన‌ట్టు అవుతుంది.

మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?

కీర్తిసురేశ్ లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..?

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo