శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 11:33:12

ర‌కుల్ విచార‌ణ‌..డైలామాలో ప‌డ్డ క్రిష్‌..!

ర‌కుల్ విచార‌ణ‌..డైలామాలో ప‌డ్డ క్రిష్‌..!

టాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిష్ యువ న‌టుడు వైష్ణ‌వ్ తేజ్ తో క‌లిసి సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టును 40 రోజుల వ్య‌వ‌ధిలో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేసుకున్నాడు క్రిష్. బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ర‌కుల్ ప్రీత్‌సింగ్ కు స‌మ‌న్లు జారీచేసిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు ర‌కుల్ ఇవాళ‌ ఎన్సీబీ విచార‌ణ‌కు కూడా హాజ‌రైంది. ఎన్సీబీ విచార‌ణ నేప‌థ్యంలో హైద‌రాబాద్ లో షూటింగ్ వ‌దిలిపెట్టి ముంబైకి వెళ్లింది ర‌కుల్‌. అయితే అధికారుల విచార‌ణకు అనుగుణంగా ర‌కుల్ వారంపాటు ముంబైలో ఉండాల్సిన ప‌రిస్తితులు నెలకొన్నాయి.

అనుకున్న స‌మ‌యానికి షూటింగ్ పూర్తి చేసేందుకు ర‌కుల్ డేట్స్ తీసుకున్న క్రిష్‌..తాజా ప‌రిస్థితులు తల‌నొప్పిగా మారాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో తెర‌కెక్కించనున్న పీరియాడిక్ డ్రామా ప్రాజెక్టు షురూ చేసే లోపే వైష్ణ‌వ్ తేజ్‌-ర‌కుల్ సినిమా పూర్తిచేయాల‌నుకున్నక్రిష్ ను ప్ర‌స్తుత‌ ప‌రిణామాలు డైలామాలో ప‌డేస్తున్నాయి. మ‌రి ర‌కుల్ వెంట‌నే వ‌చ్చి షూట్ లో జాయిన్ అవుతుందా..? లేదా విచార‌ణ కోసం అక్క‌డే ఉంటుందా..? అనేది చూడాలి. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.