గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 14, 2020 , 15:12:27

యువ న‌టుడితో కొరటాల సినిమా..?

యువ న‌టుడితో కొరటాల సినిమా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మ‌రోవైపు అల్లు అర్జున్ తో కూడా ఓ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇదిలాంటే ఈ డైరెక్ట‌ర్ కొత్త సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్కర్లు కొడుతోంది. గ‌తేడాది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంలో డిటెక్టివ్ గా క‌నిపించి మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు న‌వీన్ పొలిశెట్టి.

అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా న‌టించిన చిచోరే చిత్రంలో వ‌న్ ది ఆఫ్ లీడ్ రోల్ లో క‌నిపించాడు.  ఈ యువ న‌టుడితో ఇపుడు కొర‌టాల శివ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడంటూ డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తే కానీ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo