ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 18:17:15

త్రివిక్ర‌మ్ ను ఫాలో అవుతున్న కొర‌టాల శివ‌!

త్రివిక్ర‌మ్ ను ఫాలో అవుతున్న కొర‌టాల శివ‌!

టాలీవుడ్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారిక హాసినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ తో అసోసియేష‌న్ అవుతూ..దాదాపు త‌న సినిమాల్లో ఎక్కువ శాతం ఈ సంస్థ‌లోనే తీస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో ఇత‌ర నిర్మాత‌లతో తీయాల‌నుకున్న సినిమాల కోసం తీసుకున్న అడ్వాన్స్ డ‌బ్బులు ఈ మాట‌ల మాంత్రికుడు ఇప్ప‌టికే తిరిగిచ్చేసిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. మిర్చి సినిమాతో సూప‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. ఈ డైరెక్ట‌ర్ కూడా త్రివిక్ర‌మ్ నే ఫాలో అవుతున్నాడ‌నే వార్త ఇపుడు టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

అల్లు అర్జున్ సినిమాతో త‌న స్నేహితుడు మిక్కిలినేని సుధాక‌ర్ ను నిర్మాత‌గా ప‌రిచ‌యం చేశాడు ఈ డైరెక్ట‌ర్. ఇపుడు కొరటాల కూడా మిక్కిలినేని సుధాక‌ర్ తో త‌న సినిమాల‌న్నీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అయితే  శివ త‌న స్నేహితుడు సుధాక‌ర్ ను పార్ట్ న‌ర్ గా చేసుకుంటాడా..? లేదా సింగిల్ గానే సినిమాను ప్రొడ్యూస్ చేసే అవ‌కాశ‌మిస్తాడా అనేది తెలియాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo