సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Oct 11, 2020 , 19:41:48

గుణశేఖ‌ర్ ప‌రిశీల‌న‌లో పూజాహెగ్డే పేరు..!

గుణశేఖ‌ర్ ప‌రిశీల‌న‌లో పూజాహెగ్డే పేరు..!

భారతీయ ఇతిహాసం మహాభారతం ఆదిపర్వంలోని  విశ్వామిత్రుడు, మేనకల కుమార్తె శకుంతల, దుష్యంతుల ప్రేమకథను తాజాగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ ‘శాకుంతలం’ పేరుతో సినిమాగా తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. త‌న‌ ట్విట్టర్‌ ఖాతాలో ఈ సినిమా మోషన్‌పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో లీడ్ రోల్ లో అనుష్క పేరును ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 

అయితే తాజాగా మరోపేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. తెలుగు, హిందీ భాష‌ల్లో సినిమా చేస్తూ దేశ‌వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టి పూజా హెగ్డే. మ‌రోవైపు గుణ‌శేఖ‌ర్ లీడ్ రోల్ కోసం బాలీవుడ్ తార జాన్వీక‌పూర్ పేరును కూడా ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పాన్ ఇండియా క‌థాంశంతో భారీ బ‌డ్జెట్ తో సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా క్రేజీ ప్రాజెక్టును ప్ర‌క‌టించిన గుణ‌శేఖ‌ర్ ఎవ‌రినీ లీడ్ రోల్ కోసం ఎంపిక చేస్తాడో చూడాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo