ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 11, 2020 , 14:59:22

స్క్రిప్ట్‌ కాపీ..ఈ సారి వదిలిపెట్టనంటోన్న డైరెక్టర్‌..!

స్క్రిప్ట్‌ కాపీ..ఈ సారి వదిలిపెట్టనంటోన్న డైరెక్టర్‌..!

షార్ట్‌ ఫిలింతో తన కెరీర్‌ను ప్రారంభించి..వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్‌ సూర్య వంటి చిత్రాలతో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దేవాకట్టా. ప్రస్తుతం జీఎంబీ సంస్థలో ఓ సినిమాతోపాటు సాయిధరమ్‌తేజ్‌తో మరో మూవీకి ప్లాన్‌ చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తాను రాసుకున్న స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌ రాజ్‌ కాపీ కొట్టాడని దేవాకట్టా ఆరోపిస్తున్నట్టు వార్త ఇపుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ గా మారింది. వెబ్‌సిరీస్‌ కోసం తన కాన్సెప్ట్‌ను, స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌ రాజ్‌ కాపీ కొట్టారని దేవాకట్టా అంటున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్నేహంపై తాను ఒక కథ సిద్దం చేసుకోవడంతోపాటు ఆ స్క్రిప్ట్‌ ను రిజిస్టర్‌ కూడా చేసుకున్నానని, ఇపుడు ఇదే కథ ఆధారంగా డైరెక్టర్‌ రాజ్‌ వెబ్‌సిరీస్‌ తీస్తున్నారని దేవాకట్టా మండిపడుతున్నారు.

డైరెక్టర్‌ రాజ్‌ గతంలో కూడా తన స్క్రిప్ట్‌లను కాపీ చేశాడని, కానీ ఈ సారి మాత్రం అతన్ని వదిలిపెట్టేది లేదని దేవాకట్టా సీరియస్‌ గా చెబుతున్నారు. మరి దేవాకట్టా, రాజ్‌ల వివాదం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo