సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 15, 2020 , 15:39:26

బోయ‌పాటికి స్టార్ విల‌న్ కావాలట‌..!

బోయ‌పాటికి స్టార్ విల‌న్ కావాలట‌..!

బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో బీబీ3 (వ‌ర్కింగ్ టైటిల్‌) చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. బోయ‌పాటి సినిమా అంటే హీరోకు ఏ మాత్రం త‌గ్గ‌కుండా విల‌న్ పాత్ర‌ను ప‌వ‌ర్ ఫుల్ గా డిజైన్ చేస్తాడని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. లెజెండ్‌ లో జ‌గ‌ప‌తిబాబు, స‌రైనోడులో ఆదిపినిశెట్టిని విల‌న్లుగా చూపించిన బోయపాటి..బీబీ3 కోసం స్టార్ విల‌న్ కావాల‌ని చూస్తున్నాడ‌ట‌. గ‌తంలో సంజ‌య్ ద‌త్ ను విల‌న్ రోల్ కోసం సంప్ర‌దించారు.

అయితే సంజ‌య్ ద‌త్ క్యాన్స‌ర్ చికిత్స కోసం యూఎస్ కు వెళ్లాడు. ఆ త‌ర్వాత వివేక్ ఒబెరాయ్ పేరును ప‌రిశీలించినట్టు న్యూస్ చ‌క్క‌ర్లు కొట్టింది. తాజాగా బోయ‌పాటి విల‌న్ పాత్ర కోసం ప‌లువురు తెలుగు  స్టార్ యాక్ట‌ర్ల‌తో కూడా సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. మ‌రి బోయ‌పాటి బీబీ3 లో విల‌న్ గా ఎవ‌రిని ఎంపిక చేస్తాడ‌నేది మాత్రం స‌స్పెన్స్ గా ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo