మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 09, 2020 , 15:03:27

'కేస్ 99' మోష‌న్ పోస్ట‌ర్ లాంఛ్ చేయ‌నున్న బోయ‌పాటి

'కేస్ 99' మోష‌న్ పోస్ట‌ర్ లాంఛ్ చేయ‌నున్న బోయ‌పాటి

ప్ర‌ముఖ కాల‌మిస్ట్‌, ఫిల్మ్ మేక‌ర్ ప్రియ‌ద‌ద‌ర్శిని రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం కేస్ 99. ఈ ప్రాజెక్టు క్రైం బ్యాక్ డ్రాప్ లో మనుషుల భావోద్వేగాల నేప‌థ్యంలో సాగ‌నుంది. ఈ మూవీ మోష‌న్ పోస్ట‌ర్ రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. టాలీవుడ్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను మోష‌న్ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించ‌నున్నారు. సిటీ లో క్రైం ఇన్వెస్టిగేష‌న్ నేప‌థ్య క‌థ‌తో చాలా క‌థ‌లు వ‌చ్చాయి. కానీ ఇది గ్రామీణ నేప‌థ్యంలో.వంశీ డైరెక్ట్ చేసిన అన్వేష‌ణ చిత్రం లైన్ లో సాగుతుంది. రియ‌ల్ ఎస్టేట్ బూమ్ పెరిగిన స‌మ‌యంలో కొన్ని కుటుంబాల్లో నెల‌కొన్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా వ‌స్తుంద‌ని నిర్మాత‌లు కీర్తి చిలుకూరి, గౌత‌మ్ రెడ్డి, వివేక్ రెడ్డి తెలిపారు.

కేస్ 99కు ప్రియ‌ద‌ర్శిని రామ్ స్టోరీనందిండ‌టంతోపాటు ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నాడు. ద‌స‌రా-దీపావ‌ళి సీజ‌న్ లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo