కింగ్ నాగార్జున మంచి హిట్ కోసం పరితపిస్తున్నాడు. నాగ్ నటించిన మన్మథుడు 2, వైల్డ్ డాగ్ చిత్రాలు రెండు ప్లాప్ కావడంతో ఈ సారి చేయబోయే సినిమాతో మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. 2015లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ప్రీక్వెల్‌గా నాగార్జున తన తదుపరి చిత్రాన్ని చేయనుండగా, ఈ చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్నారు. చిత్రానికి బంగార్రాజు అనే టైటిల్‌ని ఫిక్స్ చేయగా, ఈ మూవీని అతి త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
కొన్నాళ్లుగా స్క్రిప్ట్‌లో పలు మార్పులు జరుపుకుంటూ వస్తున్న బంగార్రాజు చిత్రం ఎట్టకేలకు ఫైనల్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇందులో కథానాయికగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాని తీసుకోవాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం సోనాక్షితో చర్చలు కూడా నడుస్తున్నట్టు టాక్. దాదాపు జూలై నుండి చిత్రీకరణ మొదలువుతుందనే టాక్ నడుస్తుంది. ఇందులో చైతూ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్టు సమాచారం.