శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Aug 30, 2020 , 17:28:25

బిగ్ బాస్ ఆఫ‌ర్ కు నో చెప్పిన కొరియోగ్రాఫ‌ర్..!

బిగ్ బాస్ ఆఫ‌ర్ కు నో చెప్పిన కొరియోగ్రాఫ‌ర్..!

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 4 కు స‌ర్వం సిద్ద‌మైంది. సెప్టెంబ‌ర్ 6న సాయంత్రం 6 గంట‌ల‌కు బిగ్ బాస్ సంద‌డి షురూ కానుంది. అయితే బిగ్ బాస్ కంటెస్టంట్ల జాబితాల్లో ప‌లువురి పేర్లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుత‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ర‌ఘు మాస్ట‌ర్ బిగ్ బాస్ లో సంద‌డి చేయ‌నున్న‌ట్టు ఇప్ట‌టికే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై ర‌ఘు మాస్ట‌ర్ స్పందించిన‌ట్టు లేటెస్ట్ టాక్‌. బిగ్ బాస్ లో పాల్గొన‌నున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం. వాటిలో నిజం లేదు.

బిగ్ బాస్ షో కోసం నిర్వాహ‌కులు త‌న‌ను సంప్ర‌దించిన మాట నిజ‌మే..కానీ వ్య‌క్తిగ‌త కార‌ణాల వల్ల ఆ ఆఫ‌ర్ ను వ‌దులుకున్నాన‌ని ర‌ఘు మాస్ట‌ర్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది. స్టార్ మాలో ప్ర‌సారం కానున్న ఈ షోకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo