ఆదివారం 17 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 15:04:27

రెజువెనేష‌న్ థెరపీ లో టాలీవుడ్ సెల‌బ్రిటీలు..!

రెజువెనేష‌న్ థెరపీ లో టాలీవుడ్ సెల‌బ్రిటీలు..!

క‌రోనా విజృంభ‌ణ‌తో లాక్ డౌన్ విధించ‌డంతో దాదాపు చాలా మంది ఆహార‌పు అలవాట్ల‌ను ప‌క్క‌న‌బెట్టి హోంఫుడ్ కు అలవాటు ప‌డ్డారు. కొంత‌మందైతే ఫిజిక‌ల్ ఫిట్ నెస్ ను మ‌రిచిపోయారు. లాక్ డౌన్ అట‌కెక్కిన సినిమా షూటింగ్స్ మ‌‌ళ్లీ గ‌త కొన్ని రోజులుగా రీస్టార్ట్ అయ్యాయి. సినీ ప‌రిశ్రమ మ‌ళ్లీ పుంజుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో కొంత‌మంది న‌టీన‌టులు రెజువెనేష‌న్ థెర‌పీ (యవ్వ‌నంగా న్యూ లుక్‌లో క‌నిపించేందుకు చేయించుకునే ఆయుర్వేద చికిత్స) చేయించుకునే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ఇటీవ‌ల ఓ సీనియ‌ర్ యాక్ట‌ర్ బెంగ‌ళూరుకు వెళ్లి న్యూరోప‌తి రెజువెనేష‌న్ థెరపీని చేయించుకుంన్నాడ‌ట‌.

బెంగ‌ళూరులోని త‌న ఫాంహౌస్ లో 10 రోజులపాటు థెరపీలో పాల్గొన్న స‌ద‌రు యాక్ట‌ర్ ఇటీవ‌లే మ‌ళ్లీ షూటింగ్ లో జాయిన్ అయిన‌ట్టు టాక్‌. అలాగే 50 ప్ల‌స్ వ‌య‌స్సున్న మ‌రో నిర్మాత కూడా బెంగ‌ళూరులోని ప్ర‌ముఖ న్యూరోప‌తి సెంట‌ర్ లో థెర‌పీ చేయించుకున్నార‌ట‌. అలాగే త‌ల్లి పాత్ర‌లు పోషిస్తూ అంద‌రి అల‌రిస్తున్న ఓ టాలీవుడ్ న‌టి కూడా కోయంబ‌త్తూరులోని యోగా సెంట‌ర్ సెష‌న్ లో పాల్గొన్నందట‌. స‌ద‌రు న‌టి త్వ‌ర‌లోనే ప‌లు సినిమాల షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ద‌మైంద‌ట‌.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.