శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Aug 24, 2020 , 15:58:30

పూరీ సినిమా..ర‌మ్య‌కృష్ణ ప్లేస్‌లో సిమ్రాన్‌..!

పూరీ సినిమా..ర‌మ్య‌కృష్ణ ప్లేస్‌లో సిమ్రాన్‌..!

పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు హీరోగా ఆకాశ్ పూరి రెండో చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఢిల్లీ భామ కేతిక శ‌ర్మ‌, ఆకాశ్ పూరి కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం రొమాంటిక్‌. అనిల్ పాడూరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తోన్న ఈ మూవీలో సిమ్ర‌న్ కీ రోల్ లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది.

ఆకాశ్ పూరి ఆంటీగా సిమ్రన్ క‌నిపించ‌నున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. రొమాంటిక్ మూవీ మే చివ‌రి వారంలో విడుద‌ల కావాల్సి ఉండ‌గా..లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడింది. ఈ చిత్రానికి సంబంధించిన తుది షెడ్యూల్ షూటింగ్ త్వ‌ర‌లోనే షురూ కానుంది. పూరీ ఈ మూవీకి క‌థనందించ‌డంతోపాటు స్ర్కీన్ ప్లే, సంభాష‌ణ‌లు అందిస్తున్నాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.