మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 04, 2020 , 22:20:40

ఛాలెంజింగ్ రోల్ లో స‌మంత‌..!

ఛాలెంజింగ్ రోల్ లో స‌మంత‌..!

టాలీవుడ్ బ్యూటీ స‌మంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అయితే తాజాగా సామ్ మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో న‌టించేందుకు రెడీ అవుతుంది. తాప్సీతో గేమ్ ఓవ‌ర్ చిత్రాన్ని తీసిన డైరెక్ట‌ర్ అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ త‌న త‌ర్వాతి చిత్రం స‌మంత‌తో తీయాల‌ని ఫిక్స్ అయ్యాడు. ఈ చిత్రం కోసం స‌మంత ఛాలెంజింగ్ రోల్ చేయ‌నుంది. విక‌లాంగురాలిగా స‌మంత క‌నిపించ‌నుంద‌ట‌. చెవిటి, మూగ యువ‌తి పాత్రలో స‌మంత న‌టించ‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. మ‌రో 2-3 నెలల్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo